: సరి, బేసి ప్రయోగానికి 20 కోట్లు ... ప్రకటనలకు ఏకంగా 4 కోట్లు
ఢిల్లీలో ట్రాఫిక్, కాలుష్యం నియంత్రణకు ఆప్ సర్కారు చేపట్టిన సరి బేసి ప్రయోగానికి రూ. 20 కోట్లు ఖర్చుచేసింది. దీనిలో ప్రకటనలకు ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం 15 రోజుల పాటు అమలు చేసింది. దీనిపై అన్ని వైపుల నుండి విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం రూ. 20 కోట్లు ఖర్చుచేసి మరీ ఈ విధానం విజయవంతమైందని వెల్లడించింది. ఈ విధానం ప్రయోగంలో భాగంగా వాలంటీర్లను ఏర్పాటుచేసింది. వారు ప్రజలకు పూలను అందిస్తూ సరి బేసి విధానానికి సహకరించాలని కోరారు. అలాగే ఈ విధానం అమలు చేసిన సమయంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది.