: విద్యుత్ రాయితీల ఎత్తివేతకు కొత్త పంపుల మందు


ప్రభుత్వానికి భారంగా పరిణమించిన రైతుల విద్యుత్ రాయితీ ఎత్తివేతకు కొత్త మార్గం దొరికింది. ఇది విద్యుత్ దుర్వినియోగాన్ని నియంత్రించడంతో పాటు, సాగునీటి సద్వినియోగానికి దారితీసేలా ఉండబోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ శాఖలు సాధారణంగా రైతులకు విద్యుత్ బిల్లుల చెల్లింపులలో రాయితీలను అందిస్తుంటాయి. ఈ రాయితీలు ప్రభుత్వాలకు, ఆయా శాఖలకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో రైతులు వినియోగించే విద్యుత్ మోటార్ల సద్వినియెాగానికి, విద్యుత్ ఆదా అయ్యేందుకు కొత్త పంపులను మోటార్లకు బిగించడం ద్వారా పరిష్కారం లభిస్తుందని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 5 హెచ్ పి పంపులను వాడుతున్న రైతులు ఇందుకోసం 5 యూనిట్ల విద్యుత్ ను వినియోగిస్తున్నారు. దీంతో కొంత విద్యుత్ దుర్వినియోగం అవుతోందని గుర్తించారు. అందుకే దీనికి అనువైన పంపులను అమర్చడం ద్వారా విద్యుత్ రాయితీలను ఎత్తివేయవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News