: శంషాబాదు ఎయిర్ పోర్టులో విజిటర్లపై ఆంక్షలు...ఐబీ హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం


హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో సందర్శకులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదముందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఐబీ నుంచి అందిన సమాచారంతో హైదరాబాదు పోలీసులు శంషాబాదు ఎయిర్ పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్ పోర్టులోకి సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 31 దాకా ఆంక్షలను కొనసాగించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News