: ‘ఖేడ్’ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి కొడుకు... తొలి నామినేషన్ కూడా సంజీవరెడ్డిదే!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ పీఏసీ చైర్మన్ పటోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నగారా మోగింది. ఉప ఎన్నికలో కిష్టారెడ్డి కుమారుడు పటోళ్ల సంజీవరెడ్డినే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ ఆదేశానుసారం నిన్ననే సంజీవరెడ్డి తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి దాఖలైన తొలి నామినేషన్ కూడా సంజీవరెడ్డిదేనట. ఇదిలా ఉంటే... సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే, సదరు ఎమ్మెల్యే కుటుంబంలోని వ్యక్తినే సభకు పంపాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన టీఆర్ఎస్ తన అభ్యర్థిగా భూపాల్ రెడ్డిని ఖరారు చేసింది. త్వరలోనే ఆయన కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News