: పరిస్థితులు మరీ అంత దుర్భరంగా లేవు: అరుణ్ జెైట్లీ
దిగజారిన చమురు ధరలు, అమెరికన్ డాలర్ బలపడటం, చైనాలో ఆర్థికమాంధ్యం తలెత్తడం మొదలైనవన్నీ ప్రపంచ మార్కెట్ పై ప్రభావం చూపనున్నాయి. తాజాగా సెన్సెక్స్ కూడా 20 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. అయితే వీటి ప్రభావం భారత్ పై పడదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దేశంలో పరిస్థితులు అంత దుర్భరంగా లేవని, అదుపులోనే ఉన్నాయని అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక పరిస్థితులు దేశంపై కొంతవరకూ ప్రభావం చూపనున్నప్పటికీ, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చమురు ధరలు తగ్గినప్పటికీ, దాని లబ్ధి వినియోగదారులకు నేరుగా చేరడం లేదనే ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, దీని ప్రయోజనం పూర్తిగా ప్రభుత్వానికి కూడా చేరడంలేదన్నారు.