: అందుబాటులో భూకంపాలను పసిగట్టే టెక్నాలజీ
ఇన్నాళ్లూ భూకంపాలను ముందుగా పసిగట్టే సాంకేతిక సదుపాయాలు లేక విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తం కాలేకపోయాం. అయితే తాజాగా భూకంపాలను ముందుగానే పసిగట్టి ప్రజలను అప్రమత్తంచేసే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జర్మనీకి చెందిన జీఎఫ్‌జెడ్ పరిశోధనా కేంద్రం, భారత్ కు చెందిన టెర్రా టెక్‌కామ్ సంస్థ సంయుక్తంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన అలారం వ్యవస్థను రూపొందించాయి. ఈ పరికరం సాయంతో 60 సెకెన్ల ముందుగానే భూకంపాన్ని పసిగట్టవచ్చని, తద్వారా ప్రజలు అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంటుందని రూపకర్తలు తెలిపారు. ఒక మాస్టర్ డిటెక్టర్, రెండు సబ్ మాస్టర్ డిటెక్టర్‌లతో కూడిన ఈ పరికరం భూమి లోపల ప్రకంపనల సంకేతాలు అందిన వెంటనే అలారం మోగుతుందని తెలిపారు. ఈ నూతన పరికరాన్ని 26 దేశాలు వినియోగిస్తున్నట్లు టెర్రా టెక్‌కామ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బిజేంద్ర గోయల్ తెలిపారు.