: ఇక అన్ని రాష్ట్రాల్లో ఇంటర్ కు కామన్ సిలబస్


దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంటర్ కు కామన్ సిలబస్ ఉండేలా చూసేందుకు కేంద్ర మానవవనరుల శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డుల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది అయితే ఆయా రాష్ట్రాల పరిస్థితులు, అవసరాలకు తగినట్లుగా కొంత వరకు సిలబస్‌ లో మార్పులు చేసే అవకాశం కల్పించనుంది. దీనితో పాటు జాతీయ స్థాయిలో కామన్ ప్రశ్నపత్రాల విధానం, కామన్ వెయిటేజీ విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా అఖిల భారత స్థాయిలో అన్ని పోటీ, ప్రవేశపరీక్షలకు అనుగుణంగా 70 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News