: గ్రేటర్ బరిలో పోటీ చేయబోమన్న జగన్... నామినేషన్లు వేసిన వైసీపీ నేతలు


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మొన్ననే అధికారికంగా ప్రకటించింది. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరిస్తూ నామినేషన్ల గడువు ముగిసే చివరి రోజున ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహంతో ఊగిపోయారట. కీలక ఎన్నికలుగా పరిగణిస్తున్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిందేనని మొన్నటిదాకా ఆ పార్టీకి చెందిన నగర నేతలు ఉవ్విళ్లూరారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లిన పార్టీ... గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పార్టీ నిర్ణయంతో విభేదించిన కొందరు నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మొన్ననే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. పార్టీ బీఫాం ఇస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని గుర్తిస్తారు. ఏదేనీ పార్టీకి చెందిన అభ్యర్థికి ఆ పార్టీ బీఫాం ఇవ్వకుంటే, సదరు అభ్యర్థిని ఇండిపెండెంట్ గానే పరిగణిస్తారు. ఇదే వాదనను తెరపైకి తెస్తున్న వైసీపీ నగర నేతలు, పార్టీ బీఫారం ఇస్తే సరి, లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగానైనా బరిలోకి దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.

  • Loading...

More Telugu News