: భారత్ చేరుకున్న ఐఎస్ఐఎస్... ఢిల్లీ ఎన్.సి.ఆర్ మాల్స్, కుంభమేళా టార్గెట్?
ఢిల్లీ పోలీసులు తాజాగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరికి 19 నుంచి 23 సవంత్సరాల మధ్య వయసు ఉండవచ్చని తెలిపారు. వీరు రిపబ్లిక్ డే సందర్భంగా దాడులకు పాల్పడేందుకు పథకం రచించారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా అర్ధకుంభమేళా జరుగుతున్న హరిద్వార్ ను కూడా టార్గెట్ చేశారని తెలుస్తోందన్నారు. ఢిల్లీలోని సిటీవాక్, సాకేత్, డిఎల్ఎఫ్ ప్రొమెండా, వసంత్ కుంజ్, గ్రేట్ ఇండియా ప్లేస్ తదితర మాల్స్ లో దాడులకు దిగేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నారని పోలీసులు వివరించారు. అయితే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు పోలీసులు నేరుగా తెలియజేయడం ఇది తొలిసారి కావడం గమనార్హం