: మాకు ఇది స్పెషల్ సినిమా: నాని
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' అద్భుతమైన సినిమా అని నాని చెప్పాడు. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు మంచి అవుట్ పుట్ ఇచ్చారని అన్నాడు. సినిమా షూటింగ్ లో బాగా అలసిపోయినప్పుడు స్పూర్తినిచ్చింది ముగ్గురు చిన్నపిల్లలేనని నాని చెప్పాడు. బాగా అలసిపోయినప్పుడు ఆ ముగ్గురి ముఖాల్లో నవ్వు చూసి అంతవరకు పడ్డ కష్టం మర్చిపోయేవారమని నాని గుర్తు చేసుకున్నాడు. పిల్లల్లో అద్భుతమైన టాలెంట్ దాగుందని నాని అన్నాడు. సినిమాకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారని, దర్శకుడికి పలు సందర్భాల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలినా పట్టించుకునేవాడు కాదని నాని తెలిపాడు. సినిమా వైవిధ్య భరితమైన కథతో రూపొందిందని, అందర్నీ ఆకట్టుకుంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశాడు.