: ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ నిరాకరణ!


రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ అభ్యర్థనను తిరుపతి కోర్టు నిరాకరించింది. తిరుపతి విమానాశ్రయంలో ఎయిరిండియా అధికారిపై దాడి కేసులో మిథున్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం, కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ క్రమంలో మిథున్ రెడ్డి బెయిల్ కోసం చేసుకున్న వినతిని కోర్టు నిరాకరించింది. కాగా, నవంబర్ 26వ తేదీన తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ పై దాడి చేశారంటూ, వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మరో 13 మందిపై రేణిగుంట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రొటోకాల్ విషయమై ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ తో ఆయన గొడవపడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News