: సామాన్యంగా కనిపించే అసామాన్యుడు నాని: సుకుమార్
'సామాన్యంగా కనిపించే అసామాన్యుడు నాని' అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ చెప్పారు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ, తాను వచ్చినప్పుడు నాని ఓ పక్కగా చాలా సింపుల్ గా నిలబడ్డాడని అన్నారు. అంత టాలెంట్, సక్సెస్ రేట్ ఉన్న నాని ఇంత సింపుల్ గా ఉండడం ఆశ్చర్యకరమని, అదే అతనిలోని గొప్పతనమని సుకుమార్ చెప్పాడు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించిన సుకుమార్, నిర్మాణ సంస్థ 14 రీల్స్ కు లాభాలు కురిపించాలని అన్నారు. సినిమా విజయవంతమవుతుందని ఆయన తెలిపారు.