: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులతో వినాశనం తప్పదు: స్టీఫెన్ హాకింగ్
సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా భూగోళంపై వినాశనం తప్పదని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అన్నారు. దీని ప్రభావం కారణంగా వెయ్యి నుంచి పదివేల సంవత్సరాల మధ్యలో మానవ జాతి నశించిపోతుందని ఆయన హెచ్చరించారు. అణుయుద్ధం, పలు వైరస్ లలో జన్యుమార్పిడి వల్ల కానీ, ఇతర కారణాల వల్ల గానీ ఈ వినాశనం తప్పదని ఆయన తాజాగా పేర్కొన్నారు. గ్రహాంతర వాసుల వల్ల కూడా మానవ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని అన్నారు. కాగా, స్టీఫెన్ హాకింగ్ ఇటీవలే 74వ పడిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వార్షిక రీత్ స్నాతకోత్సవం కోసం బీబీసీ ఆయన ఉపన్యాసాన్ని రికార్డు చేసింది. ఈ నెల 26వ తేదీన బీబీసీ రేడియో-4లో ఈ ఉపన్యాసాన్ని ప్రసారం చేయనున్నారు. భూగోళం, మానవ మనుగడ, గ్రహాంతర వాసులు మొదలైన అంశాలపై ఆయన ప్రసంగించారు.