: నా లేఖకు స్పందించి వుంటే రోహిత్ చనిపోయేవాడు కాదు: వీహెచ్


నాడు తాను రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించినట్లయితే హెచ్సీయూ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ చనిపోయేవాడు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు తాను లేఖ రాసి ఏడాది గడిచిందని, ఇప్పటివరకూ సంబంధిత శాఖ స్పందించకపోవడం దారుణమైన విషయమని అన్నారు. తాను రాసిన లేఖకు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాసిన లేఖకు చాలా తేడా ఉందన్నారు. రోహిత్ ఆత్మహత్య సంఘటనపై విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని హనుమంతరావు కోరారు.

  • Loading...

More Telugu News