: అలా చేస్తే ఫుల్ మీల్స్ పెట్టినట్లుండదు: బాలయ్య


మిస్ క్యాస్టింగ్ తో చిత్రాన్ని నిర్మించడమంటే, ఫుల్ భోజనం పెట్టినట్లుగా ఉండదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రముఖ తారాగణంతో ఆయన తెరకెక్కించాలనుకున్న పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ సౌందర్య దుర్మరణంతో అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందన్న ప్రశ్నకు బాలకృష్ణ పైవిధంగా సమాధానం ఇచ్చారు. ‘నాన్నగారు నటించిన నాటి గొప్ప చిత్రం నర్తనశాల. ఇటువంటి సినిమాను మళ్లీ తెరకెక్కించాలనుకున్నాం. ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఏమి చెబుతాను? అప్పుడప్పుడు అవునంటాను.. కాదంటాను. ఇందులో పాత్రలు చాలా ముఖ్యమైనవి. అందుకు తగ్గట్లుగా మంచి నటీనటులు దొరకాలి. మిస్ క్యాస్టింగ్ తో చిత్రాన్ని నిర్మిస్తే.. ఫుల్ మీల్స్ పెట్టినట్లుగా ఉండదు. ఇందులో నేను నాలుగు పాత్రలు పోషిస్తాను. అవి శ్రీకృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు’ అని బాలయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News