: భారత మార్కెట్ లోకి ఫోర్డ్ ఎండీవర్ కొత్త మోడల్
ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారు ఫోర్డ్ భారత మార్కెట్లోకి కొత్తతరం ఎండీవర్ కారును విడుదల చేసింది. డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులోకి వస్తున్న ఈ కారు ధర ఢిల్లీ ఎక్స్ షో రూంలో రూ.23.64 లక్షలు. ఈ కారులో రెండు డీజిల్ ఇంజిన్ వేరియంట్లు ఉండగా, ఒకటి 2.2 లీటర్-4 సిలిండర్, మరొకటి 3.2 లీటర్-5 సిలిండర్ యూనిట్ గలది. ఈ కారులో పెద్ద టచ్ స్క్రీన్, శాటిలైట్ నేవిగేషన్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సీట్లు వంటి తదితర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారులను తప్పకుండా ఈ నూతన మోడల్ ఆకట్టుకుంటుందని ఫోర్డ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.