: రేపు రోహిత్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేజ్రీవాల్


హెచ్సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించనున్నారు. ఈ మేరకు రేపు ఆయన హైదరాబాద్ కు వస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. అంతకుముందు రోహిత్ ఘటనపై తొలుత స్పందించిన కేజ్రీ, ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రోహిత్ కుటుంబసభ్యులను కలసి పరామర్శించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News