: ‘పాక్’ వర్శిటీలో ఘటనలో 70 మంది మృతి.. ఆరుగురు ఉగ్రవాదుల హతం


పాకిస్థాన్ లోని బచాఖాన్ యూనివర్శిటీలోకి ఉగ్రవాదులు చొరబడిన సంఘటనలో మృతుల సంఖ్య 70కి చేరింది. ఆరుగురు ఉగ్రవాదులను పాక్ సైనికులు మట్టుబెట్టారు. ఇంకా నలుగురు ఉగ్రవాదులు వర్శిటీలోని బాయ్స్ హాస్టల్ నుంచి కాల్పులకు పాల్పడుతున్నట్లు సమాచారం. విద్యార్థులను, ప్రొఫెసర్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఉగ్రవాదుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆవరణలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది, బాంబులు పేల్చింది తామేనంటూ తెహ్రీక్-ఇ-తాలిబన్ ప్రకటించింది. ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వర్శిటీలోకి వచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది పేర్కొన్నారు. కాగా, 20 అంబులెన్స్ లను వెంటనే రప్పించారు. ఇప్పటివరకు 21 మృతదేహాలను మార్చురీకి తరలించారు. పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ యూనివర్శిటీపై ఉగ్రదాడి జరిగిన సమయంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నారు. ఈ సంఘటనతో భీతిల్లిన విద్యార్థులు, ప్రొఫెసర్లు పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News