: రోబో డిజైన్ తయారీకి ప్రజానీకం నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న నాసా


స్పేస్ లోకి పంపే రోబో డిజైన్ తయారీకోసం అమెరికా పరిశోధన సంస్థ నాసా కొత్త తరహా విధానాన్ని పాటిస్తోంది. శాస్త్రవిజ్ఞానం పట్ల ఔత్సాహికులైన, సృజనాత్మకత కలిగిన సామాన్య ప్రజానీకం నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించింది. 2017లో అంతరిక్ష కేంద్రంలోకి పంపే రోబో తయారీకి నాసా ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించింది. అయితే ప్రజల నుంచి వచ్చే ఇతర సృజనాత్మక ఐడియాలను కూడా పరిశీలించాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. రోబో డిజైన్ పై ఆసక్తి ఉన్నవారు 'ఫ్రీలాన్సర్.కామ్' వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు పంపాలని నాసా కోరింది. దరఖాస్తు చేసుకునే వారు డిజైన్ తయారీకి వారికి గల ఖాళీ సమయం వివరాలు, అకడమిక్ మెరిట్స్ గురించి తెలపాలి. అత్యుత్తమ రోబో డిజైన్ లను పంపిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులను కూడా నాసా అందిస్తుంది.

  • Loading...

More Telugu News