: రోహిత్ ఆత్మహత్య దిగ్భ్రాంతి కలిగించింది: దత్తాత్రేయ స్పందన
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యపై విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఎట్టకేలకు స్పందించారు. రోహిత్ ఆత్మహత్య దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. రోహిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 10న తనకు అందిన వినతి పత్రాన్ని కేంద్ర మానవ వనరుల శాఖకు పంపానని చెప్పిన ఆయన, ఆగస్టు 29న అందిన మరో వినతి పత్రాన్ని మరోసారి కేంద్ర మానవ వనరుల శాఖకు పంపానని ఆయన తెలిపారు. అయితే వినతి పత్రాలు పంపడం వరకే తన పాత్ర పరిమితమని ఆయన చెప్పారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని తెలిపిన ఆయన, ఇందులో తన పాత్రఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.