: హెచ్ సీయూలో జగన్... రోహిత్ మద్దతుదారుల ఆందోళనకు సంఘీభావం


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో ఆందోళనలతో అట్టుడుకుతున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్టారు. రోహిత్ మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలకు ఆయన తన సంఘీభావాన్ని ప్రకటించారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన ఘటనలను ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రోహిత్ ఆత్మహత్యపై వేగంగా స్పందించిన రాహుల్ గాంధీ నిన్న సెంట్రల్ వర్సిటీలో పర్యటిస్తే, జగన్ మాత్రం ఉప్పల్ లోని రోహిత్ కుటుంబాన్ని పరామర్శించారు. మరికాసేపట్లో విద్యార్థులను ఉద్దేశించి జగన్ ప్రసగించనున్నారు.

  • Loading...

More Telugu News