: రోహిత్ దళితుడే కాదు... కుల, శవ రాజకీయాలు మానండి: స్వరం పెంచిన ఏబీవీపీ


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో కీలక నిందితులు తమ కార్యకర్తలేనన్న ఆరోపణలపై బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిన్నటిదాకా ఆత్మరక్షణ ధోరణి అవలంబించింది. అయితే నేడు ఆ సంఘం కార్యకర్తలు స్వరం పెంచారు. ‘సేవ్ హెచ్ సీయూ’ పేరిట సరికొత్త రీతిలో ఆందోళనకు దిగిన ఏబీవీపీ... రోహిత్ వేముల అసలు దళితుడే కాదని ఆరోపించింది. వడ్డెర కులానికి చెందిన రోహిత్ దళితుడెలా అవుతాడని స్వరం పెంచింది. ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలు... కుల, శవ రాజకీయాలు వీడాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News