: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖకు నగదు నిర్వహణ యాప్


ప్రస్తుతమున్న సాంకేతికతను ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రత్యేక యాప్ రూపొందించుకుంది. అదే నగదు నిర్వహణ యాప్ (క్యాష్ మేనేజ్ మెంట్ అప్లికేషన్). రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు గానూ దాన్ని తయారుచేశారు. దేశంలో ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో బిల్లుల చెల్లింపును పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఈ ప్రయోగం చేశారు. దాంతో ఆయన ఎక్కడున్నా తన మొబైల్ ఫోన్ లో కానీ, కంప్యూటర్ లో కానీ ఎప్పటికప్పుడు 'నగదు నిర్వహణ' చూసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఆర్ బీఐ, రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలతో యాప్ ను అనుసంధానం చేశారు. త్వరలో ఈ యాప్ ను సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News