: భారత మీడియా మొత్తం అభాసుపాలైంది: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
కేవలం సంచలనానికే ప్రాధాన్యం ఇచ్చిన భారత మీడియా, పాక్ ఉగ్రవాది మసూద్ అజర్ అరెస్ట్ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా అభాసుపాలైందని కాంగ్రెస్ విమర్శించింది. అధికారుల నుంచి ఎటువంటి వివరణనూ తీసుకోకుండానే మసూద్ అరెస్ట్ అయ్యాడన్న వార్తలను మీడియా ప్రముఖంగా ప్రచురించిందని ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అసలు మసూద్ అరెస్ట్ కాలేదని, జైషే మహమ్మద్ కు చెందిన ముగ్గురిని మరో కేసులో అదుపులోకి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి పాకిస్థాన్ కావాలనే అటువంటి ప్రచారం చేసి వుండవచ్చని, దాన్ని నమ్మిన మన మీడియా బుట్టలో పడి యావత్ జాతిని తప్పుదారి పట్టించిందని ఆయన అన్నారు.