: ఇక ఏఐఎస్ఎఫ్ వంతు... దత్తన్న ఇంటిని ముట్టడించిన విద్యార్థులు, అరెస్ట్ చేసిన పోలీసులు


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను సతమతం చేస్తోంది. ఇప్పటికే రోహిత్ ఆత్మహత్యకు దత్తన్న రాసిన లేఖనే కారణమని విపక్షాలన్నీ ఆరోపిస్తుండగా, నిన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు హైదరాబాదులోని రాంనగర్ లో ఉన్న ఆయన ఇంటిని ముట్టడించారు. తాజాగా విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) విద్యార్థులు దత్తన్న ఇంటిని ముట్టడించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన దత్తన్న తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆ సంఘం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News