: ఫిబ్రవరి మొదటివారంలో రాష్ట్రపతి, ప్రధాని విశాఖ పర్యటన


ఫిబ్రవరి మొదటివారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు వారిద్దరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 5 సాయంత్రం 6.30 గంటలకు ప్రణబ్ ఢిల్లీలో బయలుదేరి రాత్రి 9.10 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ రోజు ఐఎన్ఎస్ డేగాలో బస చేస్తారు. 6వ తేదీ ఉదయం 9 నుంచి 11.45 వరకు నేవీ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. సాయంత్రం 5.20 నుంచి 6.30 వరకు నేవల్ ఆడిటోరియం సముద్రికలో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. రాత్రి 7.40 నుంచి 9 గంటల వరకు ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ లో ప్రెసిడెన్షియల్ డిన్నర్ లో పాల్గొంటారు. 7న ఉదయం 11.10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. అటు ప్రధాని కూడా 5వ తేదీన ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి బయలుదేరి రాత్రికి విశాఖ చేరుకుంటారు. ఆరో తేదీ ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నేవీ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. 9.25కు విమానంలో భువనేశ్వర్ వెళతారు. 7న మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి పలు కార్యక్రమాల్గో పాల్గొని తిరిగి మధ్యాహ్నం మూడున్నరకు విశాఖ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి 9 గంటలవరకు ప్లీట్ రివ్యూలో పాల్గొని, తరువాత డిన్నర్ చేస్తారు. అదే రోజు రాత్రి 9.25కు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళతారు.

  • Loading...

More Telugu News