: 187 పరుగుల వద్ద విడిపోయిన వార్నర్, ఫించ్ భాగస్వామ్యం!


కాన్ బెర్రాలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే పోరులో ఓపెనర్లు వార్నర్, ఫించ్ ల భాగస్వామ్యాన్ని ఇషాంత్ శర్మ విడదీశాడు. వీరిద్దరూ అద్భుత రీతిలో ఆడుతూ స్కోరును 187 పరుగులకు చేర్చిన వేళ, 30 వ ఓవర్ మూడవ బంతికి వార్నర్ ను ఇషాంత్ బౌల్డ్ చేశాడు. 92 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 93 పరుగుల వద్ద సెంచరీని మిస్ చేసుకున్న వార్నర్ పెవీలియన్ దారి పట్టగా, ఫించ్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 92 పరుగుల వద్ద ఉన్నాడు. వన్ డౌన్ గా మిచెల్ మార్ష్ వచ్చి చేరాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 32 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 193 పరుగులు.

  • Loading...

More Telugu News