: భారత అంతరిక్ష సిగలో మరో కీర్తి పతాక!


భారత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ను మరో మెట్టెక్కించేలా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి ఎగసింది. ఈ ఉదయం 9:31 గంటలకు ప్రయోగించబడిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ31 (పీఎస్‌ఎల్వీ) మరో 20 నిమిషాల తరువాత శాటిలైట్ ను అంతరిక్షంలో విడిచింది. పీఎస్ఎల్వీ ద్వారా 1,425 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. మన శాస్త్రవేత్తల అవిరళ కృషి, నిబద్ధతలు భారత కీర్తిని మరోమారు ప్రపంచానికి చాటాయని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, 2016 ఆరంభంలో సాధించిన ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో, వచ్చే రెండు నెలల్లో మరో 2 శాటిలైట్లను ప్రయోగిస్తామని ఇస్రో వెల్లడించింది.

  • Loading...

More Telugu News