: 'బోర్ వెల్ రెస్క్యూ రోబో'ను రూపొందించిన బెంగళూరు విద్యార్థులు


బెంగళూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో బోరు బావిలో పడిపోయిన చిన్నారులను వెలికితీసేందుకు ఉపకరించే బోర్ వెల్ రెస్క్యూ రోబో ను రూపొందించారు. దేశంలో తెరిచి ఉన్న బోర్ వెల్ లలో చిన్నారులు పడిపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం కోసమే వీరు ఈ రోబోను రూపొందించారు. బెంగళూరుకు చెందిన శరత్, ధనుష్, గిరిధర్ లు తమ ఉపాధ్యాయుడు ఎం.నాగరాజు సాయంతో దీనిని రూపొందించారు. ఈ బోర్ వెల్ రెస్క్యూ రోబోలో కెమెరా, ఆక్సిజన్ సరఫరా చేసే పరికరం, రోబోటిక్ ఆర్మ్, సేఫ్టీ బెలూన్ మెదలైనవి ఉంటాయి. ఇవి బోరు బావిలో పడిపోయిన చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తాయి. ఈ రోబో... ప్రమాదంలో పడిన చిన్నారిని చేరుకోగానే ఆక్సిజన్ ను అందిస్తుందని రూపకర్తలు తెలిపారు. దీని కోసం రూ. 15000 ఖర్చుచేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News