: టాస్ ఓడిన టీమిండియా... ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో వన్డేకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన టాస్ లో ఆతిథ్య జట్టు ఆసీస్ టాస్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న స్టీవ్ స్మిత్, ధోనీ సేనను ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటికే మూడు వన్డేల్లో ఓటమిపాలైన టీమిండియా టైటిల్ ను చేజార్చుకుంది. మిగిలిన రెండు వన్డేల్లోనైనా మెరుగైన ప్రదర్శన కనబరచి పరువు కాపాడుకునేందుకు ధోనీ సేన యత్నిస్తోంది. మరి ఆ ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి.