: అసద్ బాబా నగర్ ను చుట్టుముట్టిన పోలీసులు... 32 మంది విదేశీయుల అరెస్ట్


భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో ఉగ్రవాదులు మెరుపు దాడులు చేయనున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాదు పోలీసులు అప్రమత్తమయ్యారు. విదేశాలకు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న పక్కా సమాచారంతో నిన్న రాత్రి నగరంలోని అసద్ బాబానగర్ ను 300 మంది పోలీసులు చుట్టుముట్టారు. కార్డాన్ అండ్ సెర్చి సోదాలు చేశారు. అక్కడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన 32 మంది వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో వీరంతా నిబంధనల మేరకే ఉంటున్నారా? లేదా? అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News