: ఆ సోషల్ మీడియా పెద్దాయన కార్లను అడ్డదిడ్డంగా పార్క్ చేసేస్తున్నాడట
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ తన పెద్ద కార్లను ఎక్కడబడితే అక్కడ పార్క్ చేస్తూ ఇతరులకు తలనొప్పులు తెస్తున్నాడంటూ అతని ఇంటి చుట్టు పక్కలవారు ఆరోపిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న మార్క్ జుకర్ బర్గ్ తీరుపై లిబర్టీ కమ్యూనిటీలోని ఆయన ఇంటి సమీపంలో ఉంటున్న కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జుకర్ బర్గ్ సెక్యూరిటీ సిబ్బంది దారికి అడ్డంగా, చట్ట విరుద్ధంగా అతి పెద్ద రెండు సిల్వర్ కార్లను నిలిపి ఉంచుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించారు.