: నియోజకవర్గ ప్రజలకు మోదీ గిఫ్ట్...కొత్తగా 'వారణాసి-ఢిల్లీ' సూపర్ ఫాస్ట్ ట్రైన్


అవును.. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి వాసులకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇవ్వనున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసి నుండి ఢిల్లీ వరకూ నడిచే అత్యాధునిక ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను మోదీ జనవరి 22న ప్రారంభించనున్నారు. 111 కోచ్ లతో మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఈ అత్యాధునిక ట్రైన్ ను రూపొందించారు. ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ప్రయాణానికి కాస్త ఖర్చు ఎక్కువైనప్పటికీ, విమాన ప్రయాణంలో పొందే సౌకర్యాలను దీనిలో చవిచూడవచ్చు. ప్రతీ కోచ్ లోనూ ఎల్సీడీ స్ర్కీన్ లను ఏర్పాటు చేశారు. అలాగే అద్భుతమైన కార్పెట్లు, ఎల్ఇడి లైట్లు, అధికంగా మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఎకో ఫ్రండ్లీ టాయిలెట్లు ఏర్పాటుచేశారు. కాగా ఈ రైలు వారానికి మూడు రోజులు ఢిల్లీ- వారణాసిల మధ్య నడుస్తుంది.

  • Loading...

More Telugu News