: సైన్యం మట్టుపెట్టిన ఆరుగురు పఠాన్ కోట్ ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇంటి దొంగలు


పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో భారత రక్షణ బలగాలు మట్టుపెట్టిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇంటి దొంగలుండవచ్చని జాతీయ దర్యాప్తు సంఘం అనుమానిస్తోంది. ఎన్ఐఏకి చెందిన అధికారులు నేరుగా ఇంటి దొంగల పేర్లను వెల్లడించకపోయినా ఈ సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు కాగా ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చేవారంలో రానుంది. దీంతో అప్పుడు ఈ దాడులకు తెగబడిన ఇన్ సైడర్స్ గురించి స్పష్టంగా తెలిసే అవకాశముందని అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదుల్లో నలుగురిని గుర్తుపట్టినప్పటికీ, ఇద్దరి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. దీంతో వారిద్దరే ఇంటి దొంగలైవుండవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News