: రెండోసారి బద్దలైన మౌంట్ ఇగాన్


తూర్పు ఇండోనేసియాలోని మౌంట్ ఇగాన్ అగ్నిపర్వతం రెండోసారి బద్దలైంది. 2008లో తొలిసారి బద్దలైన మౌంట్ ఇగాన్ అగ్నిపర్వతం ఆరుకిలోమీటర్ల మేర దాని ప్రభావం చూపింది. గత కొన్ని రోజులుగా బూడిదను వెదజల్లుతున్న మౌంట్ ఇగాన్ మరోసారి బద్దలయ్యే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు, ఆ పర్వతం పరిసరాల్లో ఉన్న 1200 మందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. నేడు బద్దలైన మౌంట్ ఇగాన్ భారీ ఎత్తున బూడిద, విషవాయువులు వెదజల్లుతోంది. దీంతో అధికారులు అక్కడి ప్రజలకు మాస్కులు అందజేశారు. ఈ పర్వతానికి మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిపేసిన అధికారులు నష్టం తగ్గించే చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News