: పాతబస్తీలో కాంట్రాక్ట్ వివాహానికి సిద్ధపడిన సోమాలియా దేశీయుల అరెస్టు


హైదరాబాదులోని పాతబస్తీలో ఇద్దరు సోమాలియా దేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమాలియాకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు మాదన్నపేటకు చెందిన బ్రోకర్ సాయంతో కాంట్రాక్ట్ వివాహానికి సిద్ధమయ్యారు. ఇందుకుగాను మహిళ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు చెల్లించినట్టు వారు తెలిపారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వివాహ ముహూర్త సమయానికి రంగప్రవేశం చేసి, కాంట్రాక్టు పెళ్లిని అడ్డుకున్నారు. కాగా, గతంలో పాతబస్తీలో ఇలాంటి కాంట్రాక్టు వివాహాలు జరిగేవి. నిరుపేద మహిళకు బ్రోకర్ల ద్వారా కొంత డబ్బు ముట్టజెప్పిన విదేశీయులు నెల రోజులపాటు సరదాగా గడిపి, తరువాత వారిమానాన వారు వెళ్లిపోయేవారు. ఇక్కడ తలాక్ తీసుకున్న మహిళలు గర్భవతులుగా మారిన సంఘటనలు చోటుచేసుకోవడంతో స్వచ్ఛంద సంస్థలు, పోలీసుల సహకారంతో పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించాయి. దీంతో ఈ మధ్యకాలంలో ఇవి తగ్గుముఖం పట్టినా తాజాగా మరోసారి వెలుగుచూడడం ఆందోళన రేపింది.

  • Loading...

More Telugu News