: ఆరునూరైనా కాపులను బీసీల్లో చేరుస్తాం: బోండా ఉమ


ఆరునూరైనా కాపులను బీసీల్లో చేర్చి తీరుతామని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. కాపు కులస్తులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని, బీసీల్లో వారిని చేర్చుతామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కాపులను కొందరు మోసం చేశారని, ఇప్పుడు ఆ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని ఉమ విమర్శించారు. కాగా, కాపు కులస్తులను బీసీ జాబితాలో చేర్చుతానని చంద్రబాబునాయుడు నాడు హామీ ఇచ్చారు. ఈ హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలంటూ ప్రతిపక్ష, విపక్ష పార్టీలతో పాటు కాపు కులసంఘాలు, నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News