: భర్తను చంపబోయి కూతుర్ని పోగొట్టుకున్న మహిళ
భర్తను చంపబోయిన మహిళ తన కుమార్తెను కోల్పోయిన దుర్ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. త్రిపురలోని అగర్తలాలో సీతారాణి అనే మహిళ రెండో భర్త గౌతమ్ ను వదిలించుకోవాలని భావించింది. దీంతో 'టీ'లో విషం కలిపి అతనికి ఇచ్చింది. దానిని తాగకుండా ఆయన అలాగే టేబుల్ పై పెట్టేశాడు. ఇంతలో సీత పిల్లలు శ్రియ (4), మెర్రీ (12) లు ఆ'టీ'ని తాగేశారు. దీంతో శ్రియ అక్కడికక్కడే మృతి చెందగా, మెర్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో సీతపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.