: బీహార్లో 10వ తరగతి పరీక్షల్లో కాపీ కొడితే 20 వేలు ఫైన్
బీహార్ లోని పదవ తరగతి పరీక్షల్లో కాపీ కొడితే 20,000 రూపాయల జరిమానా విధిస్తామని విద్యాశాఖాధికారులు తెలిపారు. గతేడాది పదవ తరగతి పరీక్షల సందర్భంగా బీహార్ లోని నాలుగంతస్తుల పరీక్షా కేంద్రంపైకెక్కి తల్లిదండ్రులు స్లిప్పులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను బాహ్య ప్రపంచానికి చూపుతూ ఓ పత్రిక ప్రచురించిన వార్తపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడిచింది. దానిని అప్పటి విద్యాశాఖ మంత్రి సమర్థించిన సంగతి తెలిసిందే. విద్యాశాఖలో సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రకటించిన ఉన్నతాధికారులు, పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడితే 20 వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. అలాగే స్లిప్పులు అందించే తల్లిదండ్రులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.