: 119 ఏళ్ల బామ్మ గారి ఆరోగ్యసూత్రాలు, ఆయుష్షు రహస్యం !
పనిచేయడం, నడవడం, ప్రేమను కురిపించే మనుష్యుల చుట్టూ ఉండటమే తన ఆయుష్షు రహస్యమని అర్జెంటీనాకు చెందిన 118 ఏళ్ల బామ్మ సెలీనా డెల్ కార్మెన్ ఒలియా అంటోంది. త్వరలో 118 సంవత్సరాలు పూర్తి చేసుకుని 119వ పడిలోకి అడుగుపెట్టనున్న బామ్మ తన ఆరోగ్య సూత్రాలు, ఆయుష్షు రహస్యాలను చెప్పింది. పొగ తాగడం, మద్యం సేవించే అలవాట్లు లేకపోవడం, ప్రేమగా తనను చూసుకునే వ్యక్తులు ఉండటం కారణంగానే తాను ఈ వయస్సులో కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటున్నానని చెప్పింది. అర్జెంటీనా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్న ఒలియా బ్యూనస్ ఎయిర్స్ లోని తన కుమారుడు అల్బర్టో, దత్త పుత్రిక గ్లాడీ తో కలిసి నివసిస్తున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 15, 1897న ఒలియా జన్మించిందని, ఆమె డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ఉందని బామ్మగారి కుటుంబసభ్యులు తెలిపారు. అత్యధిక వయోధికురాలిగా ఆమె పేరిట ప్రపంచ రికార్డు ఉందన్నారు.