: నా దేశ భక్తిని శంకిస్తున్నారు...నేను స్పందించను: షారూఖ్ ఖాన్


మత అసహనం వ్యాఖ్యల అనుభవాలు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ లో మార్పును తెచ్చినట్టున్నాయి. అందుకే, ఈశాన్య రాష్ట్రాల్లో పాకిస్థాన్ గజల్ గాయకుడు గులాం అలీ సంగీత ప్రదర్శనల ఏర్పాటుపై షారూఖ్ స్పందనను కోరగా, అందుకు ఆయన నిరాకరించాడు. తానేం మాట్లాడినా రాజకీయం చేస్తున్నారని అన్నాడు. రాజకీయం సంగతలా ఉంచితే, తన దేశభక్తిని కూడా శంకిస్తున్నారని వాపోయాడు. అందుకే ఈ విషయంలో తానెలాంటి కామెంట్ చేయనని షారూఖ్ మీడియాకు స్పష్టం చేశాడు. కాగా, మత అసహనంపై షారూఖ్ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆయన తాజా సినిమా 'దిల్ వాలే'పై పడింది. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ సినిమా కలెక్షన్లు ఊహించినంతగా దూసుకుపోలేదు. దీంతో షారూఖ్ ఆచితూచి మాట్లాడుతున్నాడు.

  • Loading...

More Telugu News