: మంచి సినిమా ఇవ్వాలన్న కసితో చేశాము: బాలయ్య
ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలన్న కసితో 'డిక్టేటర్' చిత్రాన్ని తీశామని ఈ చిత్ర హీరో బాలకృష్ణ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం టైటిల్ చాలా పవర్ ఫుల్ అని, యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తూ పనిచేశామని చెప్పారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత తన అభిమానుల నుంచి ‘సూపర్ హిట్’ అనే రిపోర్టు వచ్చిందని అన్నారు. ఈ చిత్రం రిలీజ్ కు ముందు నుంచే కొన్ని అంచనాలు ఉన్నాయని... ఆ అంచనాలను మించి డిక్టేటర్ హిట్ అయిందని బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.