: పదిహేనేళ్ల కాలంలో చెయ్యలేని పనులు పదిహేను నెలల్లో చెయ్యాలట: ప్రధాని మోదీ


పదిహేను సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను.. పదిహేను నెలల్లో తాము చేయాలని సోనియాగాంధీ అనడం చాలా విడ్డూరంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అసోంలోని కోక్రాఝార్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను, అసోంలో కాంగ్రెస్ పాలనను మోదీ తూర్పారబట్టారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండటం కారణంగా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉండవని తాను అనుకున్నానని.. కానీ, అటువంటి పరిస్థితులు ఇక్కడ లేవని అన్నారు. కాగా, అసోం అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి.

  • Loading...

More Telugu News