: ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది: ప్రధాని మోదీ
ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోంలో పర్యటిస్తున్న మోదీ ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నైపుణ్యాభివృద్ధి కోసం తొలిసారి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రపంచంలో భారీగా మానవ వనరుల అవసరం ఉందని, ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా దేశంలోని యువత సిద్ధం కావాలని, దేశంలోని 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారేనని మోదీ అన్నారు.