: హెచ్ సీయూలో అడుగుపెట్టిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పర్యటించారు. రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ (28) ఆత్మహత్యపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్ సీయూ వీసీగా అప్పారావు కొనసాగే అర్హత కోల్పోయారని అన్నారు. ఈ సంఘటనలో కేంద్ర మంత్రుల ప్రభావం ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరూ శిక్షార్హులన్న ఆయన, ఇందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. వీసీ బాధ్యతల నుంచి అప్పారావును తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.