: ఆ మూడు రోజులు మీ ఇష్టం: జీహెచ్ఎంసీ పరిధిలో కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లకు ఈ ప్రత్యేక అధికారాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని ఫిబ్రవరి 1, 2, 5, తేదీలలో సెలవు ప్రకటించే అధికారం, పోలింగ్ కు ఎన్ని గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు మూసి వేసి ఉంచాలన్నది నిర్ణయించే అధికారం ఆయా జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. కాగా, ఎన్నికల సందర్భంగా 48 గంటల ముందు నుంచి మద్యం షాపులను బంద్ చేయించడం సర్వసాధారణంగా జరుగుతుంది.

  • Loading...

More Telugu News