: ఆర్టీసీకి సంక్రాంతి కానుక.. లాభాల పంట పండింది!
సంక్రాంతి పండగ పుణ్యమాని ఏపీ ఆర్టీసీకి లాభాల పంట పండింది. రద్దీ రోజుల్లో రోజుకు సగటున రూ.12 కోట్ల రాబడి సాధించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పండగ తర్వాత తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి పోయాయని, నిన్న ఒక్కరోజే రూ20.25 కోట్ల రాబడి ఆర్జించినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఒకేరోజు ఇంత మొత్తంలో అత్యధిక ఆదాయం రావడం ఆర్టీసీ చరిత్రలో సరికొత్త రికార్డని అన్నారు. ఇప్పటివరకు 2,500కు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపిందని, 5.5 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చామని చెప్పారు. కాగా, ఈ నెల 8 నుంచి రెగ్యులర్ బస్సులతో పాటు అదనపు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.