: రూ.50 కోట్ల పరువునష్టం దావా వేయనున్న దర్శకుడు!


ప్రముఖ మోడల్, నటుడు సుదాంన్షు పాండే చేసిన నిరాధార ఆరోపణల నేపథ్యంలో అతనిపై పరువు నష్టం కేసు వేసేందుకు బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుదాంన్షుపై రూ.50 కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. తన ఫర్మాయిష్ కథను దొంగిలించి.. అదే కథతో హృతిక్ రోషన్ హీరోగా 'కాబిల్' పేరుతో సినిమాను తెరకెక్కించేందుకు రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాలు ప్రయత్నిస్తున్నారన్నది సుదాంన్షు ఆరోపణ. ఈ మేరకు ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై రాకేష్ రోషన్, సంజయ్ గుప్తాను పోలీసులు విచారించడం, వారి స్టేట్ మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది.

  • Loading...

More Telugu News