: ఏపీలో ‘మియర్ బర్గర్’ ఎగుమతి యూనిట్
ఏపీలో సోలార్ ప్యానెల్ తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు మియర్ బర్గర్ కంపెనీ ముందుకొచ్చింది. స్విట్జర్లాండులోని జ్యురిచ్ లో ఇన్వెస్టర్ మీట్ ప్రారంభమైంది. మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం భేటీ అయింది. ఎగుమతి ఆధారిత పరిశ్రమల వైపు మియర్ బర్గర్ ఆసక్తి కనబర్చింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, రాజమహేంద్రవరం పట్టణాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ ఉత్పతుల్లో 50 శాతం ఎగుమతి చేసి, మిగిలిన 50 శాతం ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తామని కంపెనీ ప్రతిపాదించింది. ‘మియర్ బర్గర్’ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయమై అన్నివిధాలా సహకరిస్తామని కంపెనీ ప్రతినిధులకు బాబు భరోసా ఇచ్చారు.