: సీఎం అయిన తరువాత తొలిసారి షాపుకు వెళ్లి బట్టలు కొన్న కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా తన దుస్తుల కోసం షాపింగ్ చేశారు. సుదీర్ఘకాలంగా ఆయన బట్టలు కొనుక్కునే హైదర్ గూడలోని సాయి ఖాదీ భండార్ కు ఈ మధ్యాహ్నం వచ్చిన ఆయన దుస్తులు కొన్నారు. అక్కడే ఉన్న టైలర్ కు కొలతలు ఇచ్చి ప్యాంటు, షర్టులు తయారు చేయాలని చెప్పారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, 1990 ప్రాంతం నుంచి తాను సాయి ఖాదీ భండార్ లోనే బట్టలు కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. సీఎం రాక సందర్భంగా హైదర్ గూడ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయగా, కేసీఆర్ ను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.